calender_icon.png 8 January, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు చెల్లించాలి

07-01-2025 05:01:21 PM

బీఆర్ఎస్ చెన్నూర్ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్...

మందమర్రి (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా 15 వేలు అమలు చేయాలనీ బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గం ఇన్చార్జి డా. రాజా రమేష్ డిమాండ్ చేశారు. జైపూర్ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆద్వర్యంలో రూపొందించిన కరపత్రంను  బైక్ ర్యాలీ నిర్వహించి మండల రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రతి ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రసంగంలో వాగ్ధానం చేసిందని, అలాగే కౌలు రైతులకు కూడా 15 వేల రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి13 నెలల కాలంలో ఒక యాసంగి పంటకు 5000 మాత్రమే ఇచ్చిందని విమర్శించారు.

వానాకాలం పంటకు, మరో యాసంగి పంటకు రైతు భరోసా ఇవ్వలేదని, కాంగ్రెస్  ప్రభుత్వం ఒక్క ఎకరానికి  రైతుకి 17500 బాకీ పడిందని వెంటనే రైతుల బాకి తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టి రైతుల వెంట ఉండి, హక్కుల కోసం పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. రైతన్నలు మేల్కోని ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించు కోవాలని అయన కోరారు. అలాగే మహిళలకు 2500 ఇస్తానని చెప్పి మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వమని ప్రజలందరు ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసి సునీత-తిరుపతి, సీనియర్ నాయకులు జగన్ గౌడ్, గట్టయ్య, శ్రీకాంత్, వెంకటస్వామి, ధర్మయ్య, రాపెల్లి సత్తయ్య, సురేష్, శేఖర్, తుంగపిండి శ్రీనివాస్, మల్లేష్, యూత్ నాయకులు ఆకుల సాయి, సతీష్ లు పాల్గొన్నారు.