- ఆ బాధ్యత మనందరిపై ఉంది
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాం తి): దేశం కోసం కన్న బిడ్డలను అంకితం చేసిన కుటుంబాల పట్ల శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి మేనేజింగ్ కమిటీ నాల్గవ సమావేశం రాజ్‌భవన్‌లో గవర్నర్ అధ్యక్షతన శనివారం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆపదలో ఉన్న ప్రతి మాజీ సైనికోద్యోగిని, అమరుల కుటుంబాలను గుర్తించి చేరదీయాలన్నారు. వినూత్న పథకాలను ప్రవేశపెట్టడం, మాజీ సైనికుల రికార్డులు డిజిటలైజ్ చేయడంతోపాటు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ ద్వారా నిధులను సకాలం లో పంపిణీ చేయడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగా ణ ఉద్యోగులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కమిటీ పలు అంశాలను ఆమోదించింది. 25 ఏళ్లలోపు వయసున్న బిడ్డను కలిగిన మాజీ సైనికుల వితంతువులకు తక్షణ సాయం కింద రూ.2 లక్షలు అందించాలని తెలిపారు.
ఒకవేళ ఇద్ద రు పిల్లలపై ఆధారపడితే ఆ వితంతువుకు రూ.3 లక్షలు అందించాలి. అమ్మాయి పెళ్లి ఖర్చుల కోసం ఇచ్చే మ్యారేజ్ గ్రాంట్‌ను రూ.40వేల నుంచి రూ.50 వేలకు పెంచు తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.