ఎంపీ రఘునందన్‌రావు
గూండాలు, రౌడీ షీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. దాడికి సీఎం రేవంత్‌రెడ్డి, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశా రు. సీఎం సోమవారం ఒవైసీ సోదరులతో ఒకే వేదిక పంచుకున్నారని, ఇదే వేదికపై వారు బీజేపీ కార్యాలయంపై దాడికి పథకాన్ని రచించారని ఆరోపించారు. మత కల్లోలాలు సృష్టించ డం కాంగ్రెస్ చరిత్రలో భాగమేనని విమర్శించారు. బీజేపీ కార్యాలయం పై దాడితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైందన్నారు.