calender_icon.png 20 September, 2024 | 10:12 PM

నకిలీ వైద్యుడిని వెంటనే శిక్షించాలి

20-09-2024 12:36:06 AM

న్యూ లైఫ్ ఆర్‌ఎంపీ ప్రైవేట్ దవాఖాన ముందు అఖిల పక్ష నాయకుల ధర్నా 

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 19 ( విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ముందు కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసిన న్యూ లైఫ్ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుడైన నకిలీ వైద్యుడు మహమ్మద్ షమీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గురువారం అఖిల పక్ష నాయకులు ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేశారు. వైద్యం కోసం వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగింక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

బుధవారం తాడూర్ మండ లం యక్మత్తాపూర్‌కు చెందిన ఓ మహిళ జ్వరం వచ్చిందని వస్తే యోగ క్షేమాలను అడుగుతూనే ‘నీ భర్త వల్ల నీకు పిల్లలు కారు.. మా ఫ్రెండ్స్ కొందరు వస్తారు.. తన గెస్ట్‌హౌస్‌లో రెండు రోజులు గడపాలి’ అని బాధితురాలి పట్ల లైంగింక వేధింపులకు పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అనంతరం ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేయడంతోపాటు ఇలాంటి ఆర్‌ఎంపీ నకిలి వైద్యులను శిక్షించాలని కోరారు.