10-03-2025 12:04:52 AM
ఇల్లెందు, మార్చి 9 (విజయక్రాంతి): ఈసం వంశీల ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతర తేదీలు ఖరారు చేశారు. ఈనెల 19, 20, 21, తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని రోల్లగడ్డ గ్రామంలో ఈసం వంశీయుల ఇలవేల్పు జాతర రంగ రంగ వైభవంగా జరుగుతోందని ఆదివారం ఇల్లందులో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈసం వంశీయు లందరూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అందరూ వచ్చి ఇంటి దైవాన్ని దర్శిం చుకుని మొక్కులు చెల్లించుకుని కోరికలు తీర్చుకోవాలని కోరారు,
రోల్లగడ్డ గ్రామంలో క్రీడ పోటీ లు వాలీబాల్ మరియు ఆదివాసి సంస్కృత సాంప్రదాయ కార్యక్రమాలు ఉంటాయ న్నారు, దూలుగొండ తల్లిని గద్దెలెక్కించే సమయంలో ఎదురీతలు కార్యక్రమంలో తల్లి ఒక్క మహిమలను అందరం చూడవచ్చు ఆదివాసి ప్రజలందరూ మరియు ఇతర ప్రజలందరూ కూడా ఈ జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుని కోరికలు తీర్చుకోవాల్సిందిగా తెలిపారు. జాతర నిర్వహణ కమిటీ సభ్యుడు, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం నరసింహరావు తెలిపారు.