calender_icon.png 22 December, 2024 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ హాస్టల్ లో సదుపాయాలు మెరుగుపరచాలి

22-12-2024 06:42:46 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న సంక్షేమ హాస్టల్లో సదుపాయాలను మెరుగుపరచవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందని సంక్షేమ హాస్టల్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌస్ నిర్మల్ టీఎన్జీ అధ్యక్షులు ప్రభాకర్లు అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా బోనగిరి సుజయ్ ప్రధాన కార్యదర్శిగా తోట గంగాధర్ కోశాధికారిగా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని అభినందించారు. ప్రభుత్వం హాస్టళ్లకు కామన్ మెనూ వినాదాన్ని తీసుకురావడం అభినందనీయమని ప్రభుత్వ కామ అధ్య హాస్టల్ లో విద్యార్థులకు సరిపడా సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.