07-02-2025 12:27:13 AM
ప్రజారోగ్యంపై లేదు పోరాటం!
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వీధి వీధినా వెలసిన కల్లు దుకాణాలు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడు తున్నాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో ప్రాణాంతకమైన మత్తు పదార్థాలతో కృత్రి మంగా కల్లు తయారు చేసి కల్లు ప్రియులకు అంటగడుతున్నారు.
ధనార్జనే లక్ష్యంగా తక్కు వ మంది సిబ్బందితో తయారీ కేంద్రాన్ని( కల్లు డిపో ) ఏర్పాటు చేసుకొని సుచి శుభ్రత వంటివి పాటించకుండా మూగజీవాలకు తయారు చేసే కుడితి మాదిరిగా కల్తీ కల్లు తయారు చేస్తున్నారని తేటతెల్లం అవుతోం ది. నిత్యం ఎక్కడో ఒకచోట కల్లు సీసాలో బొద్దింకలు, ఎలుకలు, చివరికి విషపూరిత మైన కట్లపాములు కూడా దర్శనం ఇస్తున్నా యి.
గత కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి తాగు తున్న కళ్ళు సీసాలో కట్లపాము దర్శనం ఇచ్చిన ఘటన మరువక ముందే తాజాగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో ఓ వ్యక్తి తాగుతున్న కళ్ళు సీసాలో ఎలుక దర్శనం ఇవ్వడం కలకలం రేపుతోంది. అయినా సంబంధిత శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని భాహటం గా విమర్శలు ఉన్నాయి.
అత్యంత ప్రమాదక రమైన ఆల్ఫాజోలం, సిహె, చక్రీన్ వంటి పదార్థాలు కృత్రిమ కల్లు తయారీకి వాడుతు న్నా పట్టింపు లేకపోవడంతో కల్తీ కల్లు త యారు చేసే మాఫియా ఆగడాలు రోజురో జుకు శృతి మించుతోందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రోజువారి కూలీలే అధికం...!
నిత్యం వ్యవసాయ పొలాలు ఇతర దినసరి కూలీలుగా పనిచేస్తున్న వారే అత్యధి కంగా కల్తీ కల్లుకు బానిసలుగా మారు తున్నారు. యువత కూడా మద్యం కొను గోలు చేయలేక కల్తీ కల్లును సేవిస్తున్నారు. కల్తీ కల్లు వినియోగం రోజురోజుకు పెరుగు తున్న నేపథ్యంలో మారుమూల పల్లెల్లోనూ కల్తీ కళ్ళు సీసా ధరలను వ్యాపారులు అమాంతం పెంచేశారు.
నెలవారి మామూళ్లపైనే ధ్యాస.!
నిబంధనలకు విరుద్ధంగా విషపూరిత మైన మత్తు పదార్థాలను వినియోగిస్తూ కృత్రిమంగా తయారు చేసిన కల్తీ కల్లు వ్యాపారుల నుండి ఆప్కారి శాఖ అధికారు లు నెలవారి మామూలు వసూళ్లకు పాల్ప డుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తరచూ దుకాణాల్లో శాంపిల్ టెస్ట్ నిర్వహించి ల్యాబ్ కు పంపాల్సి ఉండగా కృత్రిమంగా తయా రు చేసిన కల్లును కాకుండా నాణ్యతగా చెట్టు నుంచి తీసిన కల్లును శాంపిల్స్ తీసి పంపు తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
గ్రామాల లో కల్తీ కళ్ళు బారినపడి మృతి చెందిన సంఘటనల్లో దుకాణదారులకు ఆప్కారి శాఖ వెన్నుదన్నుగా ఉంటుందన్న ఆరోపణ లు ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూ రు మండలం కొండనాగుల గ్రామంలో ఓ యువకుడు కల్తీకల్లు తాగి మృత్యువాత పడిన ఘటనలో యధావిధిగా దుకాణం నడుస్తుందని గ్రామస్తులు వాపోయారు.
గత కొద్దిరోజుల క్రితం బిజినపల్లి మండలం లట్టుపల్లి తండాల్లో ఒక కల్లు సీసాలో కట్లపాము కూడా దర్శనమిచ్చింది. అయినా బాధితుడికి వైద్యం చేయించాం కదా అం టూ ఆప్కారి శాఖ అధికారులే చెప్పడం విశేషం. తాజాగా గుడ్ల నర్వ గ్రామంలో కల్లు సీసాలో ఎలుక దర్శనం ఇచ్చిన ఘటనలో నూ అధికారులు కల్లు డిపో యజమాను లవైపే అండగా నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఏదైనా ఘటనలు జరిగిన సమ యంలో మాత్రమే హంగామా చేస్తూ తర్వా త మామూలుగా వ్యవహరిస్తుండటం ఆప్కారి శాఖ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం...!
కల్లు సీసాలో ఎలుక దర్శనమిచ్చిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసు కుంటాం. అనవసరమైన వార్త కథనాల తో ఆప్కారి శాఖను బదనాం చేయాల నుకోవడం సరికాదు. కట్లపాము ఘటన పై విచారణ జరిపాం బాధ్యుడి బాధితు డికి వైద్య పరీక్షలు చేయించాం. కళ్ళు సీసాలో ఎలుక వెళ్ళిందనడంలో వాస్త వం లేదు.
గాయత్రి, ఆబ్కారి శాఖ అధికారిని, నాగర్ కర్నూల్ జిల్లా