calender_icon.png 26 December, 2024 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పరీక్షా విధానం రద్దు చేయాలి’

22-12-2024 01:53:54 AM

నిర్మల్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో 20 ఏళ్లుగా పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పిం చి, పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని సెకం డ్ ఏఎన్‌ఎంలు డిమాండ్ చేశారు. తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ నిర్మల్‌లో శనివారం రాస్తారోకో చేశారు. 2003లో ప్రభు త్వ నిబంధన ప్రకారం తాము కాంట్రా క్టు ఉద్యోగానికి ఎంపిక అయినప్పటికీ తమను రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం ఆన్‌లైన్ పరీక్ష పేరుతో కుట్ర పన్నుతుందని ఆరోపించారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హమీని నెరవేర్చాలని కోరారు. అనంతరం ర్యాలీ నిర్వహించి జిల్లా వైద్య అధికారి రాజేందర్‌కు, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు కు వినతిపత్రం అందజేశారు.