calender_icon.png 26 November, 2024 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలి

11-11-2024 01:46:24 AM

లేదంటే కుటుంబ సర్వేలో పాల్గొనం

స్పష్టం చేసిన రైతు జేఏసీ నేతలు

నిర్మల్, నవంబర్ 10 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్ మండల కేంద్రం వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేస్తేనే ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వేకు సహకరిస్తామని లేదంటే సర్వేలో పాల్గొనబోమని దిలువార్‌పూర్, గుండంపల్లి రైతు జేఏసీ నేతలు మరోసారి ప్రకటించారు. రెండు గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేకు సహకరించబోమని గతంలోనే రైతులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆదివారం నిర్మల్ డీఆర్వో ఆ గ్రామాల్లో రైతులతో చర్చలు జరిపారు.

అయితే ప్రభుత్వం తమ డిమాండ్‌లను పట్టించుకోకుండా సర్వేకు సహకరించాలని ఒత్తిడి తేవడంపై వారు మండిపడ్డారు. దీంతో సర్వేను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి ఆర్డీవో రత్నకల్యాణికి వినతిపత్రం అందజేశారు.