పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ధ్వజం
హైదరాబాద్, నవంబర్ 27(విజయక్రాంతి ): మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్‌యాదవ్ డైరెక్టర్‌గా ఉన్న ఇథనాల్ కంపెనీకి దిలువార్‌పూర్‌లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీ ఆరే అనుమతి ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కంపెనీకి ఇచ్చిన అనుమతులపై ఆ గ్రామానికి వెళ్లి చర్చిద్దామా అని సవాల్ విసిరారు.
బుధవారం గాంధీభవన్‌లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే కాకుండా, ఇప్పు డు అక్కడికి వెళ్లి ఆందోళనలు చేస్తున్నదని మండిపడ్డారు. ఇథనాల్ కంపెనీకి డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్‌మెంట్ అనుమతి ఇచ్చిందన్నారు. రాష్ట్రంలోని రైతులను నిండా ముం చిన బీఆర్‌ఎస్ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని రైతులను రెచ్చగొడుతున్నారని ప్రశ్నిం చారు.
ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఎలా ఇచ్చారని బీఆర్‌ఎస్ నేతలను గ్రామస్తులు నిలదీయాలని సూచించారు. ఇథనా ల్ కంపెనీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆందోళన చేస్తుంటే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కంపెనీ పెట్టింది బీఆర్‌ఎస్ నాయకుడని, అనుమతులు ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్ అయితే.. కాంగ్రెస్‌కు ఏమి సంబంధమన్నారు. కంపెనీ విషయంలో పున:సమీ క్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.