06-04-2025 04:34:22 PM
సీఐ కుమారస్వామి..
బెల్లంపల్లి (విజయక్రాంతి): వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తాండూర్ సీఐ కుమారస్వామి అన్నారు. వోడ్నాల భీమయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రావణ్ తన తండ్రి జ్ఞాపకార్థం తాండూర్ మండల కేంద్రం శివాజి చౌక్ (ఐబీ చౌరస్తా) లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాదారం ఎస్ఐ సౌజన్యతో కలిసి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఐ కుమారస్వామి మాట్లాడుతూ... వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన దాతలు చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల అభినందిస్తున్నట్లు చెప్పారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అభినవ సంతోష్ కుమార్, రాజ్ కిరణ్, ప్రదీప్ రావు, కుమార్ చందు, ప్రశాంత్, కృష్ణమూర్తి, రాఘవి కుటుంబ సభ్యులు శ్రావణ్, ఆధ్యా, సాయి ప్రియ, అశ్విని యశోద, సంతోషి, సురేష్, మౌనిక, అర్చన్ తదితరులు పాల్గొన్నారు.