10-03-2025 10:15:03 PM
పాయం...
చర్ల, (విజయక్రాంతి): భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 12వ తేదీ నుండి జరిగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భద్రాచలం కేంద్రంగా ఏజెన్సీ న్యాయ కళాశాల మంజూరు కొరకు ఆదివాసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించాలని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ యొక్క సమస్యలు తీసుకొని వెళ్ళాలన్నారు.
ఆదివాసి ఎమ్మెల్యేలు ఆదివాసీల ఓట్ల అడగడమే కాదు ఆదివాసులకు ఉపయోగపడే ఏ సమస్యనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే గురుతర బాధ్యత ఎమ్మెల్యేలపై ఉన్నదని, ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసి నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక డిగ్రీలు, పీజీలు, టీటీసీలు చదువుకొని ఇతర వ్యసనాలకు బానిసలై జీవితాల్ని బలి చేసుకుంటున్నారని, ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం, వరప్రసాద్, పాయం సన్నాసి, ఇర్ప అరుణ్ కుమార్, నూప, సరోజినీ, కణితి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.