24-03-2025 07:47:19 PM
చేర్యాల (విజయక్రాంతి): వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని చేర్యాల మున్సిపల్ కమిషనర్ చుంచు నాగేందర్ అన్నారు. సోమవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక అంగడి బజారులో మాజీ మంత్రి నిమ్మ రాజారెడ్డి-రమాదేవి జ్ఞాపకార్థం ఆయన మనవడు నిమ్మ నిఖిల్ రెడ్డి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా మున్సిపల్ కమిషనర్ నాగేందర్, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి-అనిత కుమారుడు నిమ్మ నిఖిల్ రెడ్డి కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ నాగేందర్ మాట్లాడుతూ... వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన నిఖిల్ రెడ్డిని అభినందిస్తున్నట్లు చెప్పారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారు అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధాన రోడ్డు మార్గం కావడంతో నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుందని, వేసవికాలంలో ప్రయాణికుల దాహం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు యువజన నాయకుడు నిమ్మ నిఖిల్ రెడ్డి తెలిపారు. బాటసారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.