25-02-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
కుత్బుల్లాపూర్,ఫిబ్రవరి 24(విజయ క్రాంతి):సర్వ మత సారమే మానవ జీవన విధానమని బిఆర్‌ఎస్ పార్టీ విప్,ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పేర్కొన్నారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి డి. పోచంపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల వద్ద నూతనంగా నిర్మించనున్న మస్జిద్-ఈ -మహబూబున్నీసా బేగం,మెహబూబా అఖ్తరి మస్జిద్ కు బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లా దయతో నిర్మాణం త్వరగా పూర్తి కావాలని,ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు. పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి క్రిష్ణ, మాజీ కౌన్సిలర్లు జక్కుల కృష్ణ యాదవ్,అమరం గోపాల్ రెడ్డి, శంభీపూర్ కృష్ణ,జక్కుల విజయ శ్రీనివాస్, ఆనంద్, మాజీ ఎంపిటీసీ బండారి మహేష్, వెంకటేష్, మైనార్టీ నాయకులు మహమ్మద్ అలీ నాయర్,
చర్చి గాగిల్లాపూర్ బిఆర్‌ఎస్ మైనారిటీ ప్రెసిడెంట్ రాహాత్ అలీ, మేడ్చల్ మల్కాజ్గిరి ఉర్దూ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మహమ్మద్ నసీరుద్దీన్ ఖాద్రీ,ఖాజీ మహమ్మద్ అబ్దుల్ రషీద్,నాయకులు షేక్ గౌస్,మహమ్మద్ చాంద్ భాషా, శంషుద్దీన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఇనాయత్, అలీ పాల్గొన్నారు.