calender_icon.png 13 February, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వమతాల సారం ఒక్కటే..

13-02-2025 12:00:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 

పటాన్ చెరు, ఫిబ్రవరి 12 : విశ్వంలోని అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, ప్రతి ఒక్కరు పరమత సహనాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల పరిధిలోని శివనగర్ గ్రామంలో  మంగళవారం రాత్రి జామియా మదర్సా 84 వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మినీ ఇండియా గా పేరు అందిన పటాన్ చెరు నియోజకవర్గంలోని అన్ని మతాల ప్రార్థన మందిరాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందించినట్లు తెలిపారు.

సొంత నిధులతో గుడిలు, చర్చిలు, మసీదులు నిర్మించి దైవచింతనను పెంపొందించామని అన్నారు. భవిష్యత్తులోను అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.