- ఒక్కటి అవసరం ఉన్నా.. -టాబ్లెట్ షీట్ మొత్తం కొనాలి
కట్ చేయడం కుదరదంటున్న మెడికల్ షాపుల నిర్వాహకులు
కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లోని మెడికల్ షాపుల దౌర్జన్యం
జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చెప్పినా వినని మెడికల్ షాప్ నిర్వాహకులు
మహబూబ్ నగర్, జనవరి 12 (విజయ క్రాంతి) : కాయ కష్టం చేసుకుని జీవిస్తున్న ఓ కుటుంబానికి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లోని మెడికల్‌షాప్‌లో నిర్వాహకు లు చెప్పిన మాటలు విని ఆశ్చర్యానికి గురైన సంఘటన మహబూబ్ నగర్ లో ఇటీవల చోటుచేసుకుంది. రోగులకు రాత్రి పగలు భేదం లేకుండా వైద్య సేవలు అందించి వారి ప్రాణాలకు మా ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుతామని చెబుతూ ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది హాస్పిటలను ఏర్పాటు చేస్తుండ్రు.
ఆస్పత్రి ఏర్పాటు అయిన మరు క్షణమే వారు చేసిన వాగ్దానాలన్నీ మరిచి పోయి ప్రవర్తిస్తున్న సంఘటనలు మహబూ బ్ నగర్ పట్టణంలోని కొన్ని హాస్పిటల్లో చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలు ఎ న్ని ఉన్నా వారి ఆదాయానికి అడ్డుపడితే వా టి తుంగలో తొక్కి వారికి అనుకూలంగా మార్చుకుండ్రు.
నియంత్రించాల్సిన అధికా రులు చెప్పిన కూడా మెడికల్ షాప్ లో యజమానులు వీళ్ళని పరిస్థితి నెలకొంది అంటే మహబూబ్ నగర్ లో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించవలసిన అవస రం ఉంది. ఇటీవల జరిగిన ఒక సంఘటన స్మరించుకుంటే ఆవేదన పగవాడికి కూడా రాకూడదని ఆలోచన ప్రతి వ్యక్తిని ఆలోచిం పచేస్తుంది.
మొత్తం తీసుకోవాల్సిందే.
ఒక కుటుంబం వారి ఆర్థిక పరిస్థితి బాగా లేక హైదరాబాదులోని వారికి తోచిన చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తు న్నారు. ఆ కుటుంబహొ పెద్ద అయినా వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదు. హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకుంటే అధి కంగా డబ్బులు వెచ్చించవలసి వస్తుందని గమనించి జిల్లా కేంద్రంలోని ఆ వ్యక్తికి సం బంధించిన రోగానికి సరిపడా ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించాడు.
సంబంధిత డాక్టర్ ఆ వ్యక్తిని పరిశీలించి అవసరమైన టెస్టులు, స్కానింగ్ చేయాలని ఆ తర్వాతే మందులు అందజేసేందుకు వేలు ఉంటుందని తెలిపా రు. డాక్టర్ చెప్పింది నిజమే టెస్టులు చేసుకున్న తర్వాతే మందులు తీసుకుందా మని పరీక్షలు చేయించుకున్నాడు. అతను తెచ్చిన డబ్బులు పూర్తిగా ఖర్చయ్యాయి. మందులకు మరో రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని మెడికల్ షాప్ నిర్వాహకులు తెలిపారు.
ఆ కుటుంబం దా దాపు రెండు గంటల పాటు ఆ మెడికల్ షా ప్ ముందు నిలబడి మా దగ్గర ఉన్న డబ్బు ల కాడికి వచ్చిన మందులు ఇవ్వండి? రెండు రోజులు అయిన తర్వాత మరిన్ని డబ్బులు తీసుకువచ్చి మిగతా మందులు తీసుకుపో తామని ప్రాధాయపడ్డారు. ఈ విషయంపై పలుమార్లు మెడికల్ షాప్ యజమానిని విన్నవించినప్పటికీ, ఒక టాబ్లెట్ ఉన్న సీటు మొత్తాన్ని తీసుకోవాలని, ఆ సీటు సగం చేసి ఇచ్చేందుకు వీలులేదని తేల్చి చెప్పారు.
అయ్యో ఉన్న డబ్బులు మొత్తము టెస్టులకు ఖర్చు చేశాం, మళ్లీ మేము హైదరాబాద్ వెళ్ళాలి? తీరా మందులు తీసుకోకుండా పోతే చూయించుకొని ఏమి ఉపయోగం లేదు? ఎలా అయినా మాకు వచ్చిన కాడికి కొన్ని మందులు ఇవ్వాలని విన్నవించు కున్నారు. అయినప్పటికీ ఆ మెడికల్ షాప్ యజమాని చెల్లించలేదు.
డ్రగ్ ఇన్స్పెక్టర్ చెప్పినా మాట వినని మెడికల్ షాప్ యజమాని
పేషెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ను సంప్రదించి తమ కావాల్సిన మందులు ఇచ్చేందుకు సహాయం చేయాలని కోరారు. స్పందించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంటనే మెడికల్ షాప్ యజ మానికి ఫోన్ చేసి వారికి కావాల్సిన మందు లు ఇవ్వాలని, తిరిగి మరోసారి వచ్చి తీసుకు వెళ్తారని చెప్పారు. అయినప్పటికీ అతను ట్రగ్ ఇన్స్పెక్టర్ మాటను పరిగణలోకి తీసుకో కుండా మందులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు.
దీంతో మరో గంట సమయం వేచి చూసి ఎలాగైనా ఇవ్వండి మందులను మెడికల్ షాప్ యజమాని అడిగారు. దీంతో స్పందించిన అతను నేను చెప్పిన టాబ్లెట్ షీట్ మొత్తం కొనుక్కొని చేయండి ? మిగతా మందులు తక్కువ ఇచ్చి మీ దగ్గర ఉన్న డబ్బులు కాడికి సరి చేస్తారని తెలిపారు. దీంతో అతను చెప్పిన ఒక టాబ్లెట్ సంబం ధించిన చీటీ మొత్తాన్ని కొనుగోలు చేసి మిగతా మందిరం తగ్గించుకొని హైదరాబా ద్‌కు వెళ్లడం జరిగింది.
చెప్పినన్ని తీసుకోవాల్సిందేనా...
ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యులు మెరుగైన సేవలు అందిస్తారని ఎంతో నమ్మి కొంత మంది రోగుల దగ్గర డబ్బులు లేకపోయినా కాయకష్టం చేసుకుని ఆ డబ్బులను సరిచేసు కొని ఆస్పత్రిలో దరి చేరుతారు. వచ్చి రాగా నే ప్రాథమిక చికిత్స ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేయకుండానే మీరు ఆర్టిస్టులు ఈ టెస్టులని కొందరు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పడం తో చేసేదేం లేక డాక్టర్ చెప్పిన విధంగా టెస్టులు చేయించుకుంటారు.
అవసరం మేర కు చేసిన టెస్టులతో రోగులకు చాలా ఉప యోగకరంగా ఉంటుంది. టెస్టులకు ఒప్పుకు న్నారు కదా అని అనవసరమైన టెస్టులు చేయించి రోగులను ఇబ్బంది పెట్టకూడదని పట్టణంలోని పలువురు ప్రముఖులు ప్రజ లు కోరుతున్నారు.