13-03-2025 12:00:00 AM
పేదలపైనే ట్రాన్స్ కో ప్రతాపం
రామాయంపేట, మార్చి 12: విద్యుత్ శాఖ అధికారులు పేదవారిపై తమ అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. రామాయంపేట పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటున్న రాజు అనే వ్యక్తి ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది. కేవలం 500 రూపాయలు బిల్లు చెల్లించాల్సి ఉండగా అధికారులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేయగా, తనకు కొంత సమయం కావాలని ఎంత ప్రాధేయపడినా ఆ ఏరియా లైన్మెన్ వినిపించుకోక పోగా తక్షణమే కరెంట్ కట్ చేసి వెళ్లడం జరిగింది.
కొందరు లీడర్లు, వ్యాపారులు నెలల తరబడి బిల్లులు చెల్లించకున్నా పట్టించుకోని విద్యుత్ అధికారులు పేదలకు మాత్రం ఒక్కరోజు ఆలస్యమైనా సరఫరా బంద్ చేస్తున్నారని వాపోయారు. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి బిల్లులు వస్తూలు చేస్తున్నారని, సరియైన సమయపాలన పాటించడం లేదని విమర్శించారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ తిరుపతిరెడ్డి ని అడగగా తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని, బకాయిలు ఎక్కడ కూడా లేకుండా వసూలు చేస్తున్నామనితెలిపారు.