calender_icon.png 13 October, 2024 | 4:55 AM

ఈ నెలాఖరునే ముహూర్తం

09-10-2024 12:00:00 AM

ఎన్టీఆర్ ‘దేవర’ విజయంతో మంచి ఊపుమీదున్నాడు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో నటించనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాగా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ చివరిలో కానీ నవంబర్ మొదటి వారంలో కానీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ కూడా ఖరారైనట్టుగా తెలుస్తోంది.

9 జనవరి 2026లో చిత్రం విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. సప్తసాగారాలు దాటి సినిమాతో ఈ ముద్దుగుమ్మ దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయమైంది. అమ్మడు హీరో నిఖిల్‌తో నటించిన ’అప్పుడో ఇప్పుడో ఎప్పుడో‘ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ సరసన నటిస్తోందన్న వార్తలు సినీ పరిశ్రమలో గుప్పుమన్నాయి. ఈ సినిమాలో నటిస్తే మాత్రం రుక్మిణి వసంత్ దశ తిరిగినట్టే.