calender_icon.png 31 October, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయటపడుతున్న బీఆర్‌ఎస్ అసలు రంగు

13-09-2024 01:11:47 AM

టీ పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఆంధ్రా సెటిలర్స్ అంటూ, బతక వచ్చిన వారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీ పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైరెక్షన్‌లోనే ఆ పార్టీ ప్రాంతాల పేరుతో విద్వేషాలు రాజేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఇమేజ్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో చీలిక మొదలైందని, గౌరవ మర్యాదలు కోరుకునే వాళ్లెవరూ కౌశిక్‌రెడ్డితో పడలేక బయటకు వస్తున్నారని అభిప్రాయపడ్డారు.