18-03-2025 01:32:23 AM
హుజూర్ నగర్, మార్చి 17: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పేదవాళ్లకు నిజమైన స్వాతంత్రం లభించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు అన్నారు. సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని తెలుగు మహిళా నాయకురాలు తమ్మిశెట్టి ఈశ్వరమ్మ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు.
తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడంతో పాటుగా పేదవానికి రెండు రూపాయల కిలో బియ్యం అందించి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం అన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే సామాజిక న్యాయం లభించిందన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ, మండల ,పార్లమెంటు, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయను న్నట్లు ఆయన తెలిపారు.
గరిడేపల్లి మండలం గారకుంట తండా గ్రామానికి చెందిన రవి నాయక్ ఆధ్వర్యంలో 25మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ మండవవెంకటేశ్వర్లు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్మిశెట్టి రాములు నియోజకవర్గంలోని వివిధ మండల పార్టీ అధ్యక్షులు కీసరి తదితరులు పాల్గొన్నారు