కామారెడ్డి (విజయక్రాంతి): సురక్షిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పంతో కామారెడ్డి పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్ అన్నారు. రాష్ట్రంలోనే ఎవరు చేయని విధంగా విద్యార్థులను సమాజ బాగు కోసం అవగాహన కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ప్రతి వ్యక్తికి సమాజ బాధ్యత ఉందని గుర్తు చేయడం వల్ల ప్రమాదాలు జరగవని అన్నారు. ప్రతి విద్యార్థికి సామాజిక బాధ్యత ఉన్న విషయాన్ని ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల తెలుస్తుందన్నారు. కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఆలోచన అభినందనీయమని పేర్కొన్నారు. కామారెడ్డి పోలీసులను ఆదర్శంగా తీసుకొని సామాజిక బాధ్యతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన వచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయం అన్నారు. భద్రతగల సమాజాన్ని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరి కృషి అవసరం అన్నారు.
పోలీసులకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాల యజమానులు సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం వల్ల సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజాన్ని ఉద్ధరించే బాధ్యత ప్రతి యువతపై ఉందనే విషయాన్ని ఈలాంటి అవగాహన సదస్సుల వల్ల తెలుస్తుందన్నారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ.. ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలకు చెప్పి విద్యార్థులకు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తే సమాజం బాగుపడుతుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం అభినందనీయమన్నారు.
సమాజ బాధ్యత కేవలం పోలీసులకే ఉందనే అపోహ ప్రజల్లో ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికి సామాజ బాధ్యత ఉందని విషయం అవగాహన లేమితో తెలియడం లేదన్నారు. ప్రజలకు అవగాహన పెరిగితే ఎలాంటి ప్రమాదాలు జరగవని సమాజం అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చి ప్రతి విద్యార్థికి సమాజ బాధ్యత గురించి వివరించి అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే కళాశాల సాందీపని కళాశాల ఆర్యభట్ట కళాశాల మంజీరా కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సహకరించడం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి ఇక్కడ నేర్చుకున్న అంశాలను స్థానికంగా ఉన్న ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలన్నారు అప్పుడే సమాజ అభివృద్ధికి సహకార అందించిన వారిని అవుతామన్నారు.
రోడ్డు భద్రత క్లబ్, సైబర్ సేఫ్టీ క్లబ్, ప్రజల భద్రత క్లబ్బు, మహిళల భద్రత క్లబ్, ఆరోగ్యము వెల్నెస్ క్లబ్ లను ఏర్పాటు చేసి విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక క్లబ్బులుగా విద్యార్థులలో కొందరిని ఎంపిక చేసి సామాజిక భద్రత అంశాలలో శిక్షణ అవగాహన కల్పించి నట్లు తెలిపారు. సామాజికంగా ఉపయోగపడే వివిధ రంగాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించి వారి ద్వారా సమాజంలోని ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కే డిగ్రీ కళాశాల సీఈవో జైపాల్ రెడ్డి సాందీపని డిగ్రీ కళాశాల డైరెక్టర్ బాలాజీ రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు రాజ్ గంభీర్రావు, ఆర్యభట్ట కళాశాలల అధ్యాపకులు సత్యనారాయణ, వశిష్ట, మంజీరా, వి ఆర్ కె,ఎస్ ఆర్ కె, కళాశాలల యజమానులు ఆధ్యాపకులు, విద్యార్థులు కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరరావు, సిఐలు చంద్రశేఖర్ రెడ్డి, సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, కామారెడ్డి రూరల్ సిఐ రామన్, పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.