మల్టీవిటమిన్లు రెగ్యులర్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. ప్రత్యేకంగా గర్భిణులలో విటమిన్లు, మినరల్స్ లోపిస్తే.. మెరుగైన గర్భధారణ కోసం డాక్టర్లు విటమిన్ సప్లిమెంట్లను సూచిస్తుంటారు. అయితే వీటితో మహిళలకు ఏమాత్రం ఆరోగ్య ప్రయోజనాలు అందడంలేదని. ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోవెల్లడైంది. మార్కెట్‌లో విక్రయించే ఈ మల్టీవిటమిన్లలో చాలావరకు ఆరోగ్యమైన గర్భధారణకు అవసరమైన పోషకాలు లేవని, కొన్నింటిలో విషపూరిత లోహాలు ఉన్నాయని వెల్లడైంది.
హానికరమైన లోహాలు..
యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో స్కాగ్స్ స్కూల్ ఆఫ్ ఫార్మసీకి చెందిన డాక్టర్ లారా బోర్గెల్ట్ నేతృత్వంలో 47 ప్రినేటల్ విటమిన్లలోని కోలిన్ అయోడిన్ కంటెంట్‌ను పరిశీలించింది. వాటిలో ఆర్సెనిక్, సీసం, కాడ్మియం లాంటి హానికరమైన లోహాలున్నట్టు గుర్తించింది. ‘గర్భధారణ సమయంలో చాలామంది స్త్రీలు వారి ఆరోగ్యం, బిడ్డ ఎదుగుదలకు ప్రినేటల్ విటమిన్లను వాడుతుంటారు.
పిండం అభివృద్ధికి కీలకమైన పోషకాలలో కోలిన్, అయోడిన్ వాటిలో ఉంటాయి. అయితే వీటిలో తగిన పోషకాలు పూర్తిగా లేవు’ అని వైద్యులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో తేలింది ఏంటంటే.. లెక్కకుమించి హనికరమైన రసాయనాలు ఉన్నట్టు కూడా గుర్తించింది. గర్భధారణ సమయంలో ప్రినేటల్ సప్లిమెంట్లు ముఖ్యమైనవి. అయితే వీటిని వాడేముందు ఒకటికి రెండుసార్లు సరైన వో కాదో చూసుకోవడం చాలా ము ఖ్యం అని చెబుతున్నారు డాక్టర్లు.
గర్భదారణ సమయంలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోష కాలు అవసరం అవుతాయి. గర్భిణీ స్త్రీలు ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షి యం, విటమిన్ డి, కోలిన్, ఒ మేగా ఫ్యాటీ యాసి డ్స్, బి విటమిన్లు, విటమిన్ సి కచ్చితంగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అయితే ఆహారం ద్వారా పోషకా లు శరీరానికి అం దకపోతే సప్లిమెంట్ల రూ పంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.