08-04-2025 12:00:00 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు ఎండలు ముదరడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిపై ఎండలు పెను ప్రభా వం చూపుతోంది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఉదయం ౯ గంటలు దాటితేనే ఎండల ప్రభావం పెరగడంతో ప్రతి సోమవా రం వచ్చే ప్రజలకంటే చాలా తక్కువ మేరకు ప్రజలు వచ్చి అర్జీలను అందజేశారు. ఉష్ణోగ్రతలు మరింతగా పెరగడంతో అర్జీదారులు లేక ఫిర్యాదుల విభాగం బోసిపోయి కనిపించింది.