19-02-2025 12:00:00 AM
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ సభ్యుడు ఈటల
మహబూబాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పాలనలో విద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని గురుకుల పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడంతోనే విషాహార ఘటనలు వెలుగులోకి వచ్చాయని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.
మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లను ఆయన కలిసి బిజెపి అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత 14 నెలల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలను మోసం చేసిందని నియామకాలు చేపటక నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్న గత బిఆర్‌ఎస్ పాలన బాటలోనే రేవంత్ సర్కార్ నడుస్తుందని అన్నారు
ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నీటి మీద రాత గానే మారిందని యువతకు నెలకు 4 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ బూటకం అయిందని మహిళలకు 2500 ఆర్థిక సహాయం పత్తా లేకుండా పోయిందని ఈ సందర్భంగా అన్నారు ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకుంటుంది కానీ రాష్ర్టంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకుండా కొన్ని స్కూళ్లలో బాలికలకు మరుగుదొడ్ల వసతి సైతం లేదని అన్నారు
ఒకవేళ ఉన్న చోట్ల వాటి పరిశుభ్రతకు నిధులు లేవని గురుకులాలపై పర్యవేక్షణ లేకనే ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూశారని ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్లీ అవకాశం ఇస్తే మరిన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందని అన్నారు ఈరోజు ఉపాధ్యాయులు మనసులో పెనంలో నుండి పొయ్యిలో పడ్డామన్న రీతిగా కాంగ్రెస్ పాలన సాగుతుందని అనుకుంటున్నారని ఉపాధ్యాయులకు డిఏ చెల్లింపులు జరగడంలేదని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కొత్త పిఆర్‌ఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ దాని సంగతి మరిచిపోయిందని అన్నారు
ఒక ఉద్యోగ విరమణ చేస్తున్న టీచర్లకు రిటర్మెంట్ బెనిఫిట్స్ అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ జిల్లా నాయకులు భాస్కర్ రెడ్డి గూడూరు మండల జిల్లా మండల నాయకులు మేరే డి సురేందర్ మాజీ ఎంపీపీ వెంకన్న రాస మల్ల వెంకన్న రాంబాబు నాయక్ గుండెబోయిన మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.