08-02-2025 11:23:38 PM
షో పుటపు రాజకీయాలు చేసి కాలం వెల్లదీసిండ్రు
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి శివపుటకు రాజకీయాలు చేస్తూ కాలం వెళ్లదీశారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌకుంట్ల మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో, ముచ్చింతల్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కాలినడకన పాఠశాలలకు వచ్చే పలు గ్రామాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, చిన్న చింతకుంట దేవరకద్ర మండలాలకు విద్యుత్ ట్రాన్స్ఫార్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, మీ చదివే మీ ఇంటి ఎదుగుదలకు తోడ్పడుతుందని విషయాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని, అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి ఉంచుతామని పేర్కొన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యతమైన విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు ట్రాన్స్ఫర్లను అందజేస్తున్నామన్నారు. అందరి సంక్షేమమే మా లక్ష్యం అని తెలియజేశారు. ఇప్పుడు ఎవరికి ఆపద వచ్చిన అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలియజేశారు. భగవంతుడు అందరికీ సేవ చేసే అదృష్టాన్ని కల్పించడం జరిగిందని, మీ అందరి సహాయ సహకారాలతో సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు.అధికారులు ఉన్నారు.