మెదక్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థుల నిరసన
మెదక్, నవంబర్ 28(విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ విమర్శించారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండటాన్ని నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామన్నారు. లేనిపక్షంలో సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా, పట్టణ కమిటీ సభ్యులు కార్తీక్, అజయ్ కుమార్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.