హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): జిల్లాల్లోని విద్యాశాఖా ధికారి కార్యాలయాల్లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరి స్తోంది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ ఆర్జేడీలతోపాటు డీఈవోలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. టాస్, ఏఎస్‌వో, డీసీఈబీ, మండల్ రీసోర్స్ సెంటర్లలో ఒకేచోట కొన్నేండ్లుగా బోధనేతర విధులు నిర్వర్తిస్తు న్న ఉపాధ్యాయుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు.