24-03-2025 05:25:10 PM
బిజెపి నేత, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పారిశుద్ధ కార్మికుల విధులు గొప్పవని బిజెపి నేత, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద 64 మంది కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల కృషి చాలా కీలకం అని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పనులు చేస్తారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి జయరాజ్, నాయకులు ప్రసాద్ గౌడ్, సత్యనారాయణ, కోట వెంకన్న, శ్రీకాంత్ తదితరులున్నారు.