28-04-2025 02:05:09 AM
మంథని, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ప్రజలందరికీ మేలు కోరే కుటుంబం దుదిళ్ల కుటుంబమని, అలాంటి కుటుంబాన్ని నిందిచడం అర్ధరహితమని యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆదివారం డివిజన్ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ మంథని మండలం అడవిసోమనపల్లి మానేరు పై ఉన్న బ్రిడ్జి మరమ్మత్తులను పరిశీలనకు వెళ్లిన మాజీ ఎం ఎల్ ఏ పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు నిర్మించి ప్రజలకు అంకితం చేసిన బ్రిడ్జ్ పాతగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందని గ్రహించిన మంత్రి శ్రీధర్ బాబు పట్టించుకోవడంలేదని చేసిన వ్యాఖ్యలు సత్యదూరన్నారు. నీ కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరించి నాణ్యత లోపంతో నిర్మించిన మీరు ఓడేడు బ్రిడ్జి గాలివానకు కూలిపోయిన సంగతి మంథని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు.
10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, సోమనపల్లి బ్రిడ్జికి మరమ్మత్తులు చేయాలని కొత్త బ్రిడ్జికి నిధులు తేవాలనే సోయి లేదా అని వారు పుట్ట మధును ప్రశ్నించారు. ఇక్కడున్నటువంటి ఇసుకను లారీలలో అధిక లోడుతో బ్రిడ్జి పై తరలించడం వల్ల అడవి సోమనపల్లి బ్రిడ్జి శిధిలావస్థకు చేరిందని వారు గుర్తు చేశారు. గత పది సంవత్సరాలు నీ కుటుంబం మీ సతీమణి నీ అల్లుళ్ళు మంథని నియోజకవర్గంలో రౌడీయిజం, గుండాయిజానికి, వసూళ్లకు పాల్పడుతూ అనేక మంది పైన దాడులు అక్రమ కేసులు పెట్టించారని వారు ఆరోపించారు.
మీ కుటుంబ సభ్యుల్ని ఏమని సంబోధించాలో నీ విజ్ఞతకే వదిలేస్తున్నామని, ప్రజా పాలన వచ్చి 16 నెలల్లో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వేల కోట్ల నిధులు తీసుకొచ్చి మంత్రి నియోజక వర్గంలో పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి చేస్తూ రోడ్లు మౌలిక సదుపాయాల కల్పనలో కృషి చేశారని వారు పేర్కొన్నారు. శ్రీపాద కుటుంబం నాయకత్వంలో మంథని ప్రాంతం సుభిక్షము గా, ప్రశాంతంగా ఉండన్నారు. శ్రీపాద రావు తనయులు ఉన్నతవిద్యావంతులు అని వారి ఎదుగుదలను ఓ్ంవలేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
స్వర్గీయ శ్రీపాద రావు ఆశయ సాధన కోసం శ్రీధర్ బాబు అడుగుజాడల్లో నడుస్తూ శ్రీనుబాబు ప్రతి పల్లె, ప్రతి గూడెం, ప్రతి తాండ, ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ప్రతి కుటుంబాన్ని కలుస్తూ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందిస్తూ బిల్లులు మాఫీ చేపిస్తూ ప్రజాభిమానం పొందుతున్నారని వారు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్య కోసం కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి వారి ఉన్నత విద్యకు తోడ్పడుతున్నారన్నారు.
చదువుకున్న విద్యార్థుల ప్రభుత్వ ఉద్యోగం కోసం వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి యువత ఉపాధి కోసం కృషి చేస్తూ అందరి వారుగా గుర్తింపు పొందరన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేదలకు అందజేసేందుకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవకుడిగా పని ముందుకెలుతూ శ్రీనుబాబు గొప్ప నాయకునిగా కీర్తించబటాన్ని చూసి ఓ్ంవలేక విమర్శలు చేస్తే ఖబర్దార్ అంటూ వారు పుట్ట మధును హెచ్చరించారు.
నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నిన్ను మూడుసార్లు ప్రజలు ఓడగొట్టినా మారకపోవడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సాదుల శ్రీకాంత్, ఎరుకల ప్రవీణ్, లైశెట్టి రాజు, సూరయ్యపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రు విజయ్ పాల్గొన్నారు.