calender_icon.png 4 April, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగిన మైకంలో యువకుల వీరంగం

04-04-2025 12:02:55 AM

యువతిపై కర్రలు రాళ్లతో దాడి 

మేడ్చల్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం గ్రామ పరిధిలో యువకులు వీరంగం సృష్టించి ఒక యువతిని తీవ్రంగా గాయపరచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం వద్ద మేడ్చల్ కు చెందిన ఒక కుటుంబం దాబా నిర్వహిస్తోంది. కొంతమంది యువకులు ఆదివారం రాత్రి దాబాకు వెళ్లి తమకు సిగరెట్ కావాలని వంట మనిషిని అడిగారు.

సిగరెట్లు విక్రయించబోమని వంట మనిషి చెప్పగా, తాగిన మైకంలో ఉన్న యువకులు దాడి చేశారు. తనను కొడుతున్నారని వంట మనిషి యజమానికి ఫోన్ చేయగా, మేడ్చల్ నుంచి యజమానితోపాటు కుమారుడు, కూతురు వెళ్లారు.

మీరు అక్కడికి వెళ్ళగానే వీరిపై విచక్షణారహితంగా దాడి చేశారు. శివాని అనే యువతిని రాళ్లతో, కర్రలతో గాయపరిచారు. నన్ను వదిలేయండి ప్లీజ్ అని వేడుకున్న దాడి చేశారు. చెంచాల తో పొడిచారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.