జగిత్యాల అర్బన్, జనవరి 10: రాష్ర్టంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు యు వత నడుం బిగించాలని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సహా కార్యవాహ గుండు సాయి మధుకర్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు పురస్కరించుకొని డ్రగ్ అవేర్నెస్ అంశంపై సెమినార్ నిర్వహిం చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ భవిష్య త్తే యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలకు బానిస అవు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవి ద్యాలయాల నుంచి ప్రాథమిక పాఠశాలల వరకు ఈ డ్రగ్స్ మహమ్మారి సోకిందని, దీన్ని సమూలంగా నిర్మూలించేందుకు మన మందరం కృషి చేయాలన్నారు.
పట్నం నుం డి మారుమూల గ్రామాల వరకు డ్రగ్స్ వాడ కం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. డ్రగ్స్ రహిత రాష్ర్టంగా తీర్చిదిద్దుతానన్న ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసు కోవడం లేదన్నారు.
అఖిల భారతీయ విద్యా ర్థి పరిషత్ ఆధ్వర్యంలో డ్ర గ్స్ ఫ్రీ క్యాంపస్, అవేర్నెస్ సెమినార్స్, డ్రగ్స్ ఫ్రీ సొసైటీ, ఖేల్ కుంభ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నా రు. ఈ కార్యక్రమంలో ఆర్కేడిసి చైర్మన్ రామకృష్ణ, ఏబివిపి జిల్లా కన్వీనర్ మాడ వేణి సునీల్, ప్రిన్సిపల్ మునీందర్ , జోనల్ ఇంచార్జ్ నిఖిల్ , విష్ణు, నందు, సిద్దు, మని దీప్, రోషన్ తదితరులు పాల్గొన్నారు.