సిరిసిల్ల, జనవరి 19 (విజయక్రాంతి): ఆటో నడుపుకునే డ్రైవర్ కొటేషన్ పలువురిని ఆలో చింపజేస్తుంది. హలో రాజకీయ పార్టీలు పబ్బం కడుక్కునేందుకే ఉచితల పథకాల పేరుట ప్రజలను మోసం చేస్తుందని వాటి బారిన పడకుండా స్వయం ఉపాధి పై దష్టి సారిం చాలని వాటర్ డ్రైవర్ తన ఆటో వెనకాల రాసి ప్రచారం చేయడంపై పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సిరిసిల్ల పట్టణం బి వై నగర్ కు చెందిన రాంబాబు తన కులవత్తి వస్త్ర పరిశ్రమలో కార్మికునిగా జీవనం సాగించేవాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్య బాధపడుతుండేవాడు. డాక్టర్ సలహా మేరకు సాంచా పనినివదిలేసుకున్నాడు.
రెండేళ్ల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్న రాంబాబు తన బావ ద్వారా ఆటో నేర్చుకుని ఓ ఆటో కొనుక్కుని ఉపాధి పొందుతున్నాడు. అయితే ఉచిత పథకాలు అమలు చేయడం వల అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఉచితలపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా పునరాలోచన చేయాలని రాంబాబు కోరుతున్నాడు.