calender_icon.png 9 January, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనం నడిపేవారికి లైసెన్స్ ఉండాలి

03-01-2025 01:07:43 AM

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

 సిరిసిల్ల, జనవరి 2 (విజయ క్రాంతి): వాహనం నడిపే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని రాజన్న సిరిసిల్ల జి ల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్టీవో కా ర్యాలయంలో లర్నింగ్ లైసెన్సులు పొందిన అరులకు ఎస్పీ చేతుల మీదుగా అందజే శారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ వచ్చిన ప్ర తి ఒక్కరికి  లైసెన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో యువతి, యువకులకు  పోలీస్ శాఖ,రోడ్ రవాణా శాఖ ఆధ్వర్యంలో రెండవ దశ లైసె న్స్ మెళ నిర్వహించగా 700 వరకు దరఖా స్తు చేసుకున్నారని అన్నారు.

వారందరికీ దశల వారిగా ఆన్లున్ పరీక్ష నిర్వహించి ఉత్తీ ర్ణత సాధించిన వారికి లర్నింగ్ లైసెన్స్ లు జారీ చేసి నెల రోజుల వ్యవధిలో డ్రైవింగ్ టె స్ట్ నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయ డం జరుగుతుందన్నారు. 

ఆర్టీవో కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన 30 మందికి లైసెన్స్ టెస్ట్‌లు నిర్వహించి లర్నింగ్ లైసెన్స్‌లు అందజేయడం జరిగిం దన్నారు. ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదని, వాహనం ఉన్నా చాలా మంది డ్రైవింగ్ లైసె న్స్ లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వస్తు న్నారని, లైసెన్స్ లేకుండా వాహనం నడి పేవారికి రోడ్డు భద్రతపై అవగాహన సరిగా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతు న్నారని అన్నా రు.

లైసెన్స్ లేకుండా వాహనా లు నడిపి ప్రమాదాల భారిన పడినప్పుడు వారికి వచ్చే వారికి వచ్చే ప్రమాద భీమా వర్తించద న్నారు. జిల్లాలో డ్రైవింగ్ వచ్చిన వారికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో యువ తి, యువకులకు జిల్లా పోలీస్ శాఖ, జిల్లా రోడ్ రవాణా శాఖ ఆధ్వర్యంలో  లైసెన్స్ మె ళ నిర్వహించగా దరఖాస్తు చేసుకున్న వారికి  వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లున్ టెస్ట్‌కి సబధించిన పరీక్ష పై అవగాహన కల్పించి, వారితో నిర్ణిత రుసుముతో ఆన్లున్ లో స్లాట్ బుక్ చేపించడం జరుగుతుందన్నారు.

మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో మూ డు సార్లు ,లేదా అంతకన్నా ఎక్కవ సార్లు పట్టుబడితే వారి లైసెన్స్ రద్దు కోసం సంబం ధిత రవాణా శాఖ అధికారులకు సిపార్సు చేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐలు కృ ష్ణ, శ్రీనివాస్, డిటిఓ లక్ష్మణ్, వంశిధర్, రజిని దేవి, సిబ్బంది పాల్గొన్నారు.