06-02-2025 11:00:51 PM
ఖమ్మం (విజయక్రాంతి): కొణిజర్ల మండలం రాపల్లె మేజర్ సాగర్ కాల్వలోకి ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ దూసుకుపోయి బోల్తా కొట్టడంతో పెద్దగోపతి మాజీ సర్పంచ్ కుమారుడు తడికమల్ల రవి మృతి చెందాడు. తన పంట పొలానికి కూలీలు తీసుకుని, సాగర్ కాల్వ మీదుగా వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలో పడిపోయింది. దీంతో రవి అక్కడికక్కడే చనిపోయాడు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్దానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.