28-03-2025 12:13:11 AM
కల్లూరు, మార్చి 27: -కల్లూరు మండల వాసులకు మునగ పంట సిరులు కురిపిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభా లు వస్తుందడంతో మండల రైతులు మునగ పంట సాగు పట్ల మక్కువ చూపిస్తున్నారు.
మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యా నికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇటీవలి పరిశోధనలతో ఏకవార్షిక రకాలు.. అంటే ఆరు నెలల్లోనే కాతకు వచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాయి. సాగులో మెలకువలు పాటి స్తే, మేలైన దిగుబడులు సాధించవచ్చని స త్తుపల్లి ఉద్యాన అధికారి శ్రావణి సూచిస్తున్నారు.
అనుకూలమైన నేలలు
అన్ని రకాల నేలల్లో మునగను సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5-8 శాతం ఉండే ఇసుక రేగడి నేలలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి.జూలై నుంచి అక్టోబర్ వరకు మునగను విత్తుకోవచ్చు. అయితే ఏ సమయంలో విత్తినప్పటికీ, వేసవిలోనే అం టే.. జనవరి-ఏప్రిల్ మధ్యలోనే పూతకు వస్తుంది.
ఫిబ్రవరిలో ఎకువ పూత కాత ఉంటుంది.సాలీనా చెట్టుకు సగటున 220 మునగ కాయల చొప్పున హెక్టారుకు సుమా రు 50-55 టన్నుల దిగుబడి వస్తుంది. మునగ రకాలైన కేఎం-3, పీకేఎం-1,పీకేఎం-2 తదితర రకాలను సాగు చేస్తుంటారు. వ్యాపార కోణంలో మునగ సాగు చేయాలనుకునే రైతులు అధిక సాంద్ర పద్ధతిని ఎంచుకోవాలి.
మునగతో అధిక లాభాలు
మునగ సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెం రెవిన్యూ గ్రామానికి (దూళ్ళ కొత్తూరు ) చెందిన రైతు వడ్లపూడి బ్రహ్మానందరావు (చిట్టిబాబు ). రూ.40వేల పెట్టుబడితో, రోజుకు రూ.3 వేలకు పైనే సంపాదిస్తున్నాడు. గతేడాది తాను సాగు చేస్తున్న భూమిలో రెండు మునగ మొక్కలు పెంచాడు. వాటి ద్వారా రూ.2 వేల ఆదా యం పొందాడు. రెండు చెట్లతోనే రెండు వేల ఆదాయం రావడంతో, మునగతోట వే యాలనే ఆలోచన వచ్చింది.
వెంటనే ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి, రెండు న్నర ఎకరాల్లో 2,110 మొక్కలు పెట్టాడు. ఆరు నెలల్లోనే కాతకు రాగా, రోజుకు యాభై కేజీ ల కుపైనే దిగుబడి పొందుతున్నాడు. ఇలా రోజుకు రూ.1500వంద ల చొప్పున నెలకు రూ.45000వరకూ లాభాలు వచ్చే అవకాశం ఉంది అని రైతుల భూములు రెండు చెట్ల కాతలో 10 శాతం అమ్మితేనే రూ.2వేలు వస్తే.. పూర్తిగా మునగ తోట వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు.
వెంట నే ఉద్యానశాఖ అధికారి జి శ్రావణి తో మా ట్లాడి మొక్కల పోషణకు సంబందించిన సూచనలతో మునగ పంట సాగు చేస్తున్నారు. వెంటనే రెండున్నర ఎకరాల భూమి గతేడాది ఆగస్టులో ఐకేఎం రకానికి చెందిన 2,110 మొక్కలు నాటాడు. ఆరు నెలల తర్వా త కొంతమేర కాత ప్రారంభం కాగా, ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో కాత కాస్తున్నది.
ఏడాదికి రూ.40 వేలు ఖర్చు
రెండున్నర ఎకరాల్లో మొక్కల కోసం రూ. 10వేలు ఖర్చు చేశాడు. ఏడాది కాలం లో 10 డీఏపీ బస్తాలకు రూ.10వేలు, ఆకుమచ్చ తెగులు తదితర సస్యరక్షణ కోసం రూ.20వేలు పెట్టుబడి పెట్టాడు. ఇలా కేవ లం రూ. 40వేల పెట్టుబడితోనే పంటకాలం వడ్లపూడి బ్రహ్మానందరావు పూర్తయ్యిందని చెబుతున్నాడుఏప్రిల్ నుంచి రోజుకు రెండు క్వింటాళ్లకు పైనే దిగుబడి సాధిస్తున్నాడు. కిలో రూ.15 చొప్పున అమ్ముతూ, రోజుకు రూ.3వేల వరకు ఆదాయం ఆర్జిస్తున్నాడు.
బైక్‌పై వెళ్లి సరుకు అమ్మకం
ప్రతిరోజూ రైతు వడ్ల పూడి బ్రహ్మానందరావు ( చిట్టిబాబు )తో పాటు మేనల్లుడు శ్రీహరి , అక్కతో కలిసి కాయలు కోస్తారు. వాటిని బైక్ లేదా ఆటోలో సత్తుపల్లి తరలించి హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తారు. గతేడాది రెండున్నర ఎకరాల్లో వేసిన మునగ తోట ద్వారా మంచి ఆదా యం వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే.. దీనికి పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. అందుకే ఈ ఏడాది రెండు ఎకరాలను అదనంగా, మునగ సాగు చేద్దాం అనుకుం టున్నామని రైతు తెలిపారు.