14-02-2025 01:32:24 AM
అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
రాజంపేట , ఫిబ్రవరి 13,(విజయ క్రాంతి): రాజంపేట్ మండలం బస్వాన్నపల్లి గ్రామం నందు తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్న విషయం గ్రామస్థులు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రాజంపేట మండల పర్యటనలో భాగంగా వారి దృష్టికి తీసుకురాగా గతంలో ఎమ్మెల్యే స్పెషల్ ఫండ్స్ నుండి రెండు సార్లు బోరు వేయగా బోరు ఫెయిల్ కవడం జరిగింది అని తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి మిషన్ భగీరథ అధికారులతో ఫోన్లో మాట్లాడి గ్రామస్తులకు తాగు నీటి సౌకర్యం కలిపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది.