- మెడికల్ కళాశాలకు అనుమతులు హర్షణీయం
- ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
మెదక్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మెదక్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరేలా మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ అనుమతులు రావడం శుభపరిణామమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. మెదక్‌కు మెడికల్ కళాశాల మం జూరు కావడంతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి బుధవారం మాతా, శిశు సంరక్షణ కేంద్రం పక్కన శాశ్వత మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి ఎలాంటి సహకారాలు కావాలన్నా అందిస్తానని స్పష్టం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో ఏరియా ఆసుప త్రి సూపరింటెం డెంట్ శివదయాల్, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ..
రామాయంపేట(మెదక్): రామాయంపేట మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 129 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రోహిత్‌రావు బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. తహసీ ల్దార్ రజనీకుమారి, మాజీ ఎంపీపీ రమేశ్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమె యాదగిరి, చిలుక గంగాధర్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రామచంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.