22-04-2025 01:08:53 AM
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం
త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు
పినపాక ఏప్రిల్ 21(విజయ క్రాంతి): పేదవారి ఎంటికల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్టు గా ఎంపికైన భూపాలపట్నం గ్రామాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, నాణ్యమై న సిమెంట్, మెటీరియల్స్ వినియోగించి , త్వరగా పూర్తి చేయాలని అధికారులను, లబ్ధిదారులను ఆదేశించారు. అనంతరం లబ్ధిదారులు బొగ్గం సరిత, చల్లా వెంకటరమణ, సనప సడాలు, కుంజా లక్ష్మి, బొగ్గం రమ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించి, వారి సొంత ఇంటి కల నెరవేరుతుండడం పట్ల అభిప్రాయాన్ని చెప్పమన్నారు.
ఓ లబ్ధిదారు సన్న బియ్యం ఇస్తున్నారు, సొంత ఇల్లు ఇస్తున్నారు కదా ఇంత కన్నా మాకు సంతోషం ఏమున్నది సార్ అంటూ ఇళ్లు పూర్తి చేసుకున్నాక ఏట కోసి బువ్వ పెడతానని చెప్పడంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నవ్వుతూ, సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాలో రూ 1లక్ష జమ అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పినపాక తహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపిడిఓ సునీల్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి తపాల్గొన్నారు.