గద్వాల, జనవరి 15 (విజయక్రాంతి): రాష్టం లోని పేద ప్రజల స్వంతింటి కల ఇందిరమ్మ ఇండ్ల తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కష్ణ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గద్వాల మండలం సంబంధించిన ఎంపీడీవో కార్యాలయంలో, మరియు ధరూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో నందు ఇందిరమ్మ ఇల్లు మోడల్ నమూనా నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమానికి అయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నికలలో సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజలకు ఇస్తామని చెప్పిన ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి, గహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు రాష్ర్టవ్యాప్తంగా ప్రతి మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు నమూనా మోడల్ నిర్మాణాన్ని తయారుచేసి ఐదు లక్షల రూపాయలలో ఒక హాలు, బెడ్ రూమ్ కిచెన్, నిర్మాణం చేసి నిర్మాణం చేసి పేద ప్రజలకు చేయించడం జరుగుతుంది. రాష్ర్ట ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించడం జరిగింది.
వీటిని భాగంగానే ఇందిరమ్మ ఇల్లు కొరకు నమోదు చేసుకున్న వారికి త్వరలోనే ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేసి వీటిలో అర్హులైన వారికి ఎంపిక చేసి మొదటి విడతలు వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా భవి ష్యత్తులో కూడా మరి కొంతమందికి కూడా ఇందులో మహిళలు మంజూరు చేసే విధంగా రాష్ర్ట ప్రభుత్వం కషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, గహ నిర్మాణ శాఖ అధికారులు, ఎంపీడీవోలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు