calender_icon.png 10 January, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘డబుల్’ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి

07-09-2024 12:44:37 AM

అధికారులకు ఎమ్మెల్యే సంజయ్ ఆదేశాలు

జగిత్యాల, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): జగిత్యాలలో చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎం సంజయ్‌కుమార్ ఆదేశించారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. నూకపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలతో పాటు ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు.

న్యాక్ సెంటర్, ఏటీసీ సెంటర్ పనులను, టీఆర్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమం, బాలికల సంరక్షణ కేంద్రాన్ని సందరించారు. పనులు పూర్తి చేసేందుకు అదనపు నిధుల కోసం వెంటనే అంచనాలను తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వెజ్ వెజ్ మార్కెట్‌ను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలన్నారు.