calender_icon.png 24 November, 2024 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్పకు వాడిన డాల్బీ ఇక్కడిదే!

23-11-2024 12:00:00 AM

భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ వేడుక వేదికగా ఆసక్తికర విషయం వెలుగు చూసింది. అదేంటంటే ‘పుష్ప 2’లో డాల్బీ టెక్నాలజీని వినియోగించారు. ఇది కూడా విశేషం కాదు కానీ.. ఇండియాలో ఈ టెక్నాలజీ తొలిసారిగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అందుబాటులోకి తీసుకురావడం విశేషం. శుక్ర వారం ఇఫ్ఫీ వేడుకల నాగార్జున దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. “డాల్బీ విజన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ని రూపొందించాలని రాజమౌళి భావించారు

కానీ భారత్‌లో దానికి సంబంధించిన సదుపాయాలు లేకపోవడంతో ఆయన జర్మనీకి వెళ్లి మరీ ఆ పనులు పూర్తి చేశారు. అప్పుడే ఆ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నాం. వెంటనే డాల్బీ టెక్నాలజీని స్టూడియోలో ఏర్పాటు చేశాం. ‘పుష్ప 2‘తో మేము దానిని ప్రారంభించడం ఆనందంగా ఉంది. అలాగే ఇదే తొలిసారి” అని నాగార్జున పేర్కొన్నారు.