calender_icon.png 5 April, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జింకను చంపిన కుక్కలు

05-04-2025 02:29:57 AM

  1. హెచ్‌సీయూ సౌత్ క్యాంపస్‌లోకి వచ్చిన జింకపై కుక్కల దాడి
  2. కంచ గచ్చిబౌలి చెట్ల నరికివేత ప్రభావం
  3. సీఎస్‌తో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 4: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్‌లో జింక మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమిలో కొన్ని చెట్లను తొలగించడంతో వన్యప్రాణులకు పూర్తిగా నీడ కరువైంది.

దీంతో యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్‌లోకి వచ్చిన జింకపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేసి చంపేశాయి. విద్యార్థులు గమనించి క్యాంపస్ సెక్యూరిటీ అధికారులకు సమాచారమిచ్చినా అప్పటికే జింక మృతిచెందడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. జింక  కళేబరాన్ని నల్లగండ్లలోని వెటర్నిటీ హాస్పిటల్‌కు తరలించారు.  

అక్కడికి ఎవరూ వెళ్లొద్దు: డీసీపీ 

శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూముల్లోకి ఎవరూ వె ళ్లొద్దని, ఎవరైనా వెళ్తే శిక్షార్హులని మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రకటనలో పేర్కొన్నారు. 400 ఎకరాల భూములకు సంబంధించి పి ల్‌లు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణలో ఉన్నందున ఎవరికీ ప్రవేశం లేదని తెలిపా రు. అనుమతి లేకుండా వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

అధికారులతో భట్టి సమావేశం

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఉన్నతాధికారులతో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, అటవీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెట్ల తొలగింపు పనులతో పాటు ఆ భూమిలో చెట్ల సంరక్షణ మినహా అన్నిరకాల కార్యకలాపాలను తక్షణం నిలిపేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే.

మూడు రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లను కొట్టేయడంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుంది. కమిటీలో ఉపము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది.