calender_icon.png 12 January, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలు

02-08-2024 12:05:00 AM

  1. ఇంట్లో నిద్రిస్తుండగా దాడి 
  2. విడిపోయిన శరీర భాగాలు 
  3. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 1(విజయక్రాంతి): కుక్కల దాడిలో వృద్ధురాలు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ముస్తాబాద్ మండలం, సేవాలాల్‌తండా గ్రామం బట్టోనితాళ్లలో పిట్ల రాజ్యలక్ష్మి(80) ఒంటరిగా నివాసముంటున్నది. బుధవారం అర్ధరాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి కుక్కలు చొరబడి వృద్ధురాలి శరీరాన్ని భయంకరంగా కొరికేశాయి. గొంతుపై దాడి చేయడంతో రాజ్యలక్ష్మి మృతిచెందింది. శరీరంలోని పలు అవయవాలను కుక్కలు పీక్కుతిన్నాయి. గురువారం ఉదయం స్థానికులు చూసే సరికి రాజలక్మి తన ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. గ్రామంలోని కుక్కలను ఏరివేయాలని స్థానికులు కోరుతున్నారు. 

పిచ్చికుక్క దాడిలో 21 మందికి గాయాలు

కూకట్‌పల్లి: బాలానగర్‌లో పిచ్చికుక్క 21 మందిని కరిచింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్, వినాయక నగర్, కళ్యాణ్ నగర్‌లో గురువారం సాయంత్రం ట్యూషన్‌కి వెళ్తున్న పిల్లలతో పాటు పని నిమిత్తం వెళ్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసి, గాయపర్చింది.