calender_icon.png 10 March, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగద్విదితంగా దివ్య విమాన రథోత్సవం

10-03-2025 01:29:32 AM

  • శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన దారుడై దర్శనం 

భక్తజన సంద్రం యాదగిరిగుట్ట 

యాదాద్రి భువనగిరి, మార్చి 9 (విజయక్రాంతి): అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన యాదగిరిగుట్ట శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం. కనుల పండు గగా, రమణీయంగా, జరిగిన అనంతరం. భక్తకోటి జయ జయ ధ్వనాల మధ్య రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలో అత్యంత వైభవపీతంగా కళ్యాణ ఉత్సవమూ ర్తుల దివ్య విమాన రథోత్సవం  జగద్విది తంగా  నిర్వహించారు. 

రథస్థం కేశవం. దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని శాస్త్రము తెలియజేస్తుంది. స్వామిని దర్శించిన జన్మ రహిత్యము మనో రది సిద్ధి అందివ్వగలదని ఈ వేడుక సూచి స్తుందని అర్చకులు తెలిపారు. సర్వ మంత్ర, యంత్ర తంత్ర,స్మృతి పారం అంతరార్థం కలిగిన ఈ రథోత్సవ వేడుక దర్శించిన సర్వ సంపత్ కలుగునని మోక్షం సిద్ధించునని, వేదోక్తి వివరిస్తుందని.ప్రధానార్చకులు వివ రించారు.

శరీరం పురుషస్య అంటూ. ఈ దేహము ఒక రథమని ఇంద్రియాలు అశ్వ ములని వాటి పగ్గాలను దిగబట్టి దేహమనే రథాన్ని సుఖమైన మార్గంలో నడిపేవాడుగా జీవుడుని భగవానుడు రక్షిస్తాడని ఈ వేడుకలుని అంతరార్థమని వివరించారు.

స్వామివారి ఆలయంలో నిత్యారాధన అనంతరం సాయంత్రం చతుస్థానార్చకుల మండప ఆరాధనలు. ధ్వజా రోహణ పూజలు దివ్య ప్రబంధ పారాయనీయులు, మహామంత్ర పుష్ప పట్టణాలు, పురాణ ఇతిహాస విజ్ఞాపనలు నిర్వహించారు. శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా దివ్య విమాన రథోత్సవాన్ని నిర్వహించారు.

శ్రీ మహావిష్ణువు అలంకారం గరుడ వాహన సేవలో భక్తులకు దర్శనం 

బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజు ఉదయం ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారిని శ్రీమహావిష్ణు అలంకారము గరుడ వాహన సేవలో అలం కరించి ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్ర ధాన అర్చకులు, యజ్ఞాచార్యులు, వేద పం డితులు, చెక్క బృందం, పారాయనీకులు. స్వామివారిని తిరువీధులలో ఊరేగించారు.

గరుడవాహన సేవ ప్రత్యేకత

శ్రీ మహావిష్ణు అనగా సర్వ వ్యాప్తి అయిన తత్వమని ఆతత్వము అంతట వ్యాపించి స మస్త జీవుల కర్మ ఫలాలను అనుసరించి ఫలితాలను ఇస్తూ పరిరక్షించు తత్వమే విష్టు తత్వం. వేద స్వరూపుడు అయినా పరమాత్మ వేదాత్మకుడైన గరుడ వాహన సేవలో బ్ర హ్మోత్సవాలలో భక్తకోటికి దర్శనం అం దించుట ప్రత్యేకమైనది. శ్రీ వైష్ణవ సాంప్ర దాయంలో గరుడైకి  పేరియా తిరువడి పేరు.

అనగా గొప్ప దాసుడు అని అర్థం స్వామివారికి దాసుడుగా శుకుడుగా వాహనముగా ఆసనంగా అనేక విధాలైన కైంకర్యాలను నిర్వహిస్తాడు గరుడు గరుడు. గరుడ వాహన దారుడైన శ్రీ స్వామి వారి దివ్యదర్శనం సర్వ జ్వరాది బాధలు నశించి ఆధ్యాత్మిక జ్ఞానం కలుగునని శాస్త్రాలు తెలియజేస్తున్నాయని ప్రధాన అర్చకులు వివరించారు.

స్వామివారి దివ్య విమాన రథోత్సవ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఈవో భాస్కర రావు, ఉప కార్యనిర్వాహణాధికారి, ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, అర్చక బృందం, ఆలయ ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.

అలరించిన సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తాగ్రేసరు లకు స్వామివారి లీల లను, ప్రాశస్త్యాన్ని తెలియజేయడానికి నిర్వహిస్తున్న సంగీత సాహిత్య సభలు సాంస్కృతి కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అనుశ్రీ హైదరాబాదు వారు సంగీత విభా కార్యక్రమాన్ని నిర్వహించారు యాదాద్రి భజన సేవా సమితి. 

శబరి గిరీష అయ్యప్ప భక్తబృందం కార్వాన్ వారు భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఆస్థానం వారు మంగళవాద్యం వైదిక ప్రార్థన నిర్వహించారు. శ్రీమాన్ అమరవాది వెంకట నరసింహా చార్య స్వామి వారు దశావతార నరసింహవతార వైభవన గురించి ఉపన్యసించారు. శ్రీమతి విజయవల్లి భరద్వాజ్ భాగవతారని గజేంద్ర మోక్షం అని హరికథ గానాన్ని నిర్వహించారు. కుమారి ఈదుల కంటి వీణ, కుమారి స్వతంత్ర కృష్ణ బృందం, మంజుల డాన్స్ బృందం కూచిపూడి నృత్యం ప్రదర్శించారు.

శ్రీ వెంకట అన్నమాచార్య ప్రాజెక్ట్ బృందం హైదరాబాద్ వారు స్వామి వారి సేవ ముందు కోలాట నృత్య బృందాన్ని ఏర్పాటు చేశారు. 

శ్రీ వాగ్దేవి మ్యూజిక్ అకాడమీ వారు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించగా, వైష్ణవి గోపాల బృందం హైదరాబాద్ వారు వీణవాద్యాన్ని నిర్వహించారు. 

శ్రీ కాసర్ల విశ్వజ ప్రసాద్, విష్ణుజా హైదరాబాదు వారు కూచిపూడి ముత్యాన్ని ప్రదర్శించారు. ఒగ్గు శ్రీను బృందం మల్లాపురం వారు ఒగ్గు కథ వినిపించారు. 

శ్రీ గడ్డం సుదర్శన్ యాదగిరిగుట్ట వారు చిందు యక్షగానాన్ని ప్రదర్శించారు.