calender_icon.png 11 January, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ

06-12-2024 09:42:26 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అక్టోబర్ 21 పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన పోలీస్ అధికారులు సిబ్బంది, విద్యార్థులకు శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రశంసా పత్రాలను అందజేశారు. కేటగిరీల వారీగా నిర్వహించిన ఈ వ్యాస రచన పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని విజేతగా ఎంపిక చేయడం జరిగింది. ఎస్సై, ఆ పై స్థాయి అధికారులకు ఇచ్చిన అంశం సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ లో మొదటి బహుమతి అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్, రెండో బహుమతి షీ టీమ్ ఆర్ఎస్ఐ రమాదేవి, మూడో బహుమతిని ఆర్ఎస్ఐ జగన్మోహనాచారీలు గెలుచుకున్నారు. కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ వరకు ఇచ్చిన అంశం మై రోల్ ఇన్ ఇంప్రూవింగ్ పోలీస్ ఇమేజ్ ఇన్ సొసైటీ లో డిసిఆర్బి లో ఏఎస్ఐ గా పని చేస్తున్న రఘురాములు మొదటి బహుమతిని, కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రామ్ దాస్ రెండో బహుమతిని, టేకులపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఉపేందర్ రావ్ మూడో బహుమతిని గెలుచుకోవడం జరిగింది.

విద్యార్థిని, విద్యార్థులకు ఇచ్చిన అంశం జుడియస్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ లో కొత్తగూడెం పట్టణంలోని శ్రీ ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో చదువుతున్న శ్రీ కారుణ్య మొదటి బహుమతిని, పాల్వంచలోని శ్రీ సాయి స్ఫూర్తి డిఏవి స్కూల్లో 8వ తరగతి చదువుతున్న యువతేశ్వరి రెండో బహుమతిని గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలలో జిల్లా నుండి విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈరోజు అందుబాటులో ఉన్న విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు.