calender_icon.png 15 March, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి

14-03-2025 12:00:00 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ, మార్చి 13 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ , పదో తరగతి వా ర్షిక పరీక్షలలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డు లో ఉన్న  తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల,కళాశాల(ధర్మసాగర్)ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలా రాస్తున్నారు, నీట్, ఎం సెట్ లకు దరఖాస్తు చేశారా అని కలెక్టర్ జూ నియర్ కళాశాల విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా ఎనిమిది, తొమ్మి ది, పదో తరగతి క్లాసురూములకు వెళ్లి వి ద్యార్థునులతో కలెక్టర్ మాట్లాడారు.  వార్షిక పరీక్షల సన్నద్ధత గురించి విద్యార్థినులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.గ్రంథాలయా న్ని సందర్శించిన కలెక్టర్ అందులో ఉన్న వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసె ట్, నీట్  పరీక్షల పుస్తకాలను కళాశాల విద్యార్ధినులకు కలెక్టర్ అందజేశారు.

వంట గది, స్టోర్ రూమ్‌లను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థినులకు వండిన భోజనాన్ని, కూరలను  పరిశీలించారు. విద్యార్ధినులకు ఉద యం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అ ల్పాహారం, భోజనం, అందించే  మెనూ చా ర్ట్‌ను పరిశీలించారు. విద్యార్ధినులకు సం బంధించిన టాయిలెట్స్‌ను పరిశీలించారు.

పరీ క్షలు రాస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థినులతో పాటు వార్షిక పరీక్షలు రాయ బోతున్న విద్యార్ధినులతో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు బాగా సన్నద్ధమై ఫలితాల్లో మంచి మార్కులు సాధించి రా ష్ట్రంలో జిల్లా పేరును నిలపాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు కలెక్టర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ప్రిన్సిపల్ శైలజ, ఉపాధ్యాయులు, అధ్యాపకులతో మాట్లాడి సమ స్య లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. యథాస్థానానికి పాఠశాల, కళాశాలను తరలించేం దుకు అక్కడ కావాల్సిన వసతి సదుపాయల గురించి ప్రతిపాదనలు సమర్పిస్తే వాటిని మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించా రు.

అనంతరం పదో తరగతి వి ద్యార్ధినులకు కలెక్టర్ పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, ఇతర పరీక్ష సామాగ్రి అందజేశారు. పదో తరగతి హాల్ టికెట్లను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చే శారు. పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్ధినులు పాల్గొన్నారు.