calender_icon.png 21 January, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి

21-01-2025 12:00:00 AM

బేటీ బచావో బేటి పడావో కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ 

మెదక్, జనవరి 20(విజయక్రాంతి): జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారిక కేంద్రం మరియు మిషన్ శక్తి ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంపై సమన్వయ సమావేశంలో సీనియర్ సివిల్  జడ్జి జితేందర్, జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి హైమావతి, , అదనపు ఎస్పీ మహేందర్ ఇతర శాఖల అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ సోమవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంబంధిత శాఖలతో సమన్వయ ఏర్పాటు చేసుకుని ఆడపిల్లల ఎదుగుదలకు సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షల చట్టంపై వైద్య సిబ్బంది ఆశా వర్కర్లతో ఆడపిల్లలని స్పృత్తి పెంచడానికి గ్రామాల్లో తరచు ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు చట్టపరమైన సంరక్షణ కల్పించి కృషి చేయాలి అన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్షణ పై ప్రజలకు వివరిస్తూ బాలిక సాధికారత దిశగా జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని అన్నారు. బేటి బచావో బేటి  పడావో పథకం 10 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడానికి కార్యచరణ ముమ్మరం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, సిడిపిఓలు, సఖి మహిళా సాధికారత బృందాలు పాల్గొన్నారు.