calender_icon.png 1 March, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్ ను తనిఖీ చేసిన జిల్లా అధికారి..

01-03-2025 06:07:56 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలతో పాటు ఎస్టీ హాస్టల్లో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జాదవ్ అంబాజీనాయక్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.