calender_icon.png 24 November, 2024 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా వైద్యాధికారి

12-11-2024 04:59:13 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజ్ సందర్శించారు. ప్రధాన ఆసుపత్రి కావడంతో నిత్యం నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల నిర్వాణపై వైద్యులను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సుధాకర్ నాయక్, ఏ ఎం ఓ వెంకటేష్, తాళ్ల గురజాల, తాండూర్, నేన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.