01-04-2025 11:24:52 PM
సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి..
దేవరకొండ: భవననిర్మాణ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా 7వ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కొండమల్లేపల్లిలోని ఏఐటీయూసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మాణ రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని ఏఐటీయూసీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. 1996లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమచట్టాన్ని తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. నల్లగొండలో ఈ నెల 12న నిర్వహించనున్న జిల్లా 7వ మహాసభకు కార్మికులు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఇంద్రయ్య, అమరవాది నగేశ్, పాల్వాయి యాదగిరి బొడ్డుపల్లి బిక్షం తదితరులు పాల్గొన్నారు.